Tue Mar 31 2026 12:41:49 GMT+0530 (India Standard Time)
గవర్నర్ నరసింహన్ కు నారాయణ వాట్సప్ మెసేజ్

గవర్నర్ నరసింహన్ కు నారాయణ వాట్సప్ మెసేజ్ పంపారు. ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకావాలని నారాయణకు గవర్నర్ నరసింహన్ ఆహ్వానం పంపారు. అయితే నారాయణ గవర్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇటీవల మీరు చేసిన వ్యాఖ్యలు, మీ వ్యవహార శైలి బాగాలేదని నారాయణ వాట్సప్ మెసేజ్ పంపారు. రిపబ్లిక్ డే వేడుకలకు, ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకానని తెలిపారు. ఇకపై గవర్నర్ పాల్గొనే కార్యక్రమాలకు తాను హాజరు కానని నారాయణ తెలిపారు.
- Tags
- నారాయణ
Next Story

