గణతంత్రాన్ని భగ్నం చేయాలనుకున్న తీవ్రవాదులను ...!

భారత గణతంత్ర వేడుకలను భగ్నం చేయడానికి కుట్ర పన్నిన తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్ లోని యూరి సెక్టార్ ప్రాంతంలో పాకిస్థాన్ నుంచి సరిహద్దు దాటి భారత్ లోకి చొరబడుతున్న జైషే అహ్మద్ ఉగ్రవాదులను ఆర్మీ గుర్తించి వారితో సుదీర్ఘ పోరాటం సాగించింది. ఈ ఆపరేషన్ లో ఏడుగురు తీవ్ర వాదులు హతం అయ్యారు. సైన్యం నిర్వహించిన కీలకమైన ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రత్యేకంగా వారిని అభినందించారు. పాకిస్థాన్ ఇప్పటికైనా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని రాజనాధ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
భారీ విధ్వంసానికి ప్రణాళిక ....
హతమైన ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు ఎంకౌంటర్ అనంతరం స్వాధీనం చేసుకున్నాయి . దేశ రాజధాని ఢిల్లీ లో గణతంత్ర వేడుకలను టార్గెట్ చేసుకుని పెద్దఎత్తున విధ్వంసానికి తీవ్ర వాదుల బృందం ప్లాన్ చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. కేంద్ర నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్మీ సరిహద్దుల వెంట గస్తీ పెంచింది. ఫలితంగా తీవ్రవాదుల ఆటకు చెక్ పడింది. తాజాగా జరిగిన జైషే తీవ్రవాదుల ఎన్ కౌంటర్ తో ఐబి దేశంలోని అన్ని కీలక ప్రాంతాలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రవాదులకు తగిలిన భారీ దెబ్బకు జైషే మూకలు విజృభించే నేపథ్యంలో ఐబి మరింత అప్రమత్తత ప్రకటించింది.
- Tags
- తీవ్రవాదులు

