గడ్కరీ గేమ్ స్టార్ట్ చేశారే.....!

టిడిపి బిజెపి బంధానికి తూట్లు పడ్డాయి అనడానికి పోలవరం ప్రాజెక్ట్ లో సాగుతున్న తంతంగం చాలు. విభజన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్రం నుంచి రిక్వెస్ట్ చేసి సాధించారు. రాబోయే ఎన్నికలముందు బిజెపి, టిడిపి నడుమ దూరం పెరిగిపోయింది. ఇరు పార్టీలు ప్రాజెక్ట్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు నడుం బిగించాయి. ఢిల్లీ లో పోలవరం ప్రాజెక్ట్ లో ప్రతిష్టంభన తొలగించే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం.
గ్రౌండ్ లెవెల్ పర్యవేక్షణ దగ్గరుండి కేంద్రం చూస్తుందా ...?
టెండర్లలో తప్పులతో కొత్త టెండర్లు ఆపాలంటూ పోలవరం అథారిటీ ప్రకటించింది. పోలవరాన్ని కేంద్రం ఆపేస్తుందంటూ పసుపు దళం ప్రచారం మొదలు పెట్టడాన్ని కాషాయదళం సహించలేక పోతుంది. ఆ అంశాన్ని సైతం తనను కలిసిన దేవినేని ఉమ కి స్పష్టం చేయడం విశేషం. ఇకపై ప్రతి పదిహేను రోజులకు ప్రాజెక్ట్ సందర్శనకు గడ్కరీ ప్లాన్ చేశారు. ఆయన రెగ్యులర్ పర్యవేక్షణ అంటే బిజెపి ప్రాజెక్ట్ నిర్మాణం క్రిడిట్ పక్కాగా తమకే దక్కాలని ముందుకు వెళుతుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అంతే కాదు విస్తృతంగా పోలవరం పై చర్చ జరిపిన గడ్కరీ పనులు వేగవంతం చేయాలనీ పాత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఇదంతా 2018 కి పూర్తి కావాలంటూ గడ్కరీ డెడ్ లైన్ పెట్టడం మరో గొప్ప అంశం. ఇప్పటికే పోలవరం సోమవారం గా మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు కి మించి కేంద్రమంత్రి గేమ్ స్టార్ట్ చేశారు. రాబోయే రోజుల్లో బాబు, గడ్కరీ ఏమి చేయబోతున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
- Tags
- గడ్కరీ

