Tue Mar 31 2026 07:23:59 GMT+0530 (India Standard Time)
గజల్ కు బెయిల్... షరతులు వర్తిస్తాయి...!

యువతి లైంగిక వేధింపుల కేసు లో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈనెల 2వ తేదీన గజల్ అరెస్ట్ అయ్యారు. రెండో తేదీ నుంచి గజల్ శ్రీనివాస్ చంచల్ గూడ జైలులోనే ఉన్నాు. అయతే ఇదే కేసులో నెంబర్ 2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా ముందస్తు బెయిల్ మంజూరయింది. అయితే గజల్ శ్రీనివాస్ కు కోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి బుధవారం, ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు గజల్ శ్రీనివాస్ హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో పాటు పదివేల రూపాయల పూచికత్తు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఇరవై రోజుల నుంచి గజల్ శ్రీనివాస్ జైలులోనే ఉన్నారు.
- Tags
- గజల్ శ్రీనివాస్
Next Story

