Tue Mar 31 2026 05:40:53 GMT+0530 (India Standard Time)
ఖైదీల కోరిక మేరకు గజల్ ఏం చేశారంటే...?

23 రోజుల పాటు జైలులో ఉన్నారు. బెయిల్ వచ్చింది. అయితే తోటి ఖైదీల కోరిక ఆయన తీర్చారు. గజల్ శ్రీనివాస్....యువతిని లైంగికంగా వేదించిన కేసులో గజల్ శ్రీనివాస్ జైలు పాలయిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ రావడంతో తోటి ఖైదీలు ఆయనను కచేరీ చేయాల్సిందిగా కోరారు. బెయిల్ వచ్చిన సంతోషంలో గజల్ శ్రీనివాస్ కచేరీ చేశారు. 23 రోజులుగా తనతో కలిసి ఉన్న మిత్రులకు వీనుల విందైన గజల్స్ వినిపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషిగా బయటపడతానని గజల్ శ్రీనివాస్ చెప్పారు.
- Tags
- గజల్ శ్రీనివాస్
Next Story

