క్షేత్రస్థాయిలో వైసీపీని దెబ్బతీసేందుకు...?

చంద్రబాబు కిందిస్థాయి నేతలపైన కూడా దృష్టిపెట్టనున్నారు. కేవలం ఎమ్మెల్యే స్థాయి నేతలే కాకుండా నియోజకవర్గంలో పట్టున్న నేతలను పార్టీలోకి తీసుకురావాల్సిందిగా చంద్రబాబు నేతలకు ఉద్భోదించారు. గ్రామ స్థాయి నుంచి రాజకీయ పునరేకీకరణ జరగాలనిచంద్రబాబు కోరారు. అంటే గ్రామ స్థాయి నుంచి చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంపై నేతలతో మాట్లాడిని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని నామినేటెడ్ పోస్టులకు సిఫార్సు చేయవద్దని సూచించారు. ఇప్పటికే టీడీపీలోకి 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు. నియోజకవర్గాల పెంపు జరగదని దాదాపుగా తేలిపోవడంతో ఇప్పుడు గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలపై దృష్టి సారించారని అర్ధమవుతోంది.
ఎవరొచ్చినా చేర్చుకోండి....
అంతేకాదు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ కార్యక్రమం ముగింపు సభను భారీ ఎత్తున డిసెంబర్ లో చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు వేదికను నిర్ణయించాల్సిందిగా ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో బాగా పనిచేయని ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులతో తానే స్వయంగా మాట్లాడతానని ముఖ్యనేతలతో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేవలం ఎమ్మెల్యే స్థాయి నేతలు మాత్రమే సరిపోరని, గ్రామ స్థాయి నేతలు వస్తేనే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. ఇందుకో్సం అందరూ పనిచేయాలని కోరారు. వేరే పార్టీలో ఉన్నప్పటికీ.. మంచి పేరుండి.. ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలను పార్టీలోకి తీసుకునేందుకు సందేహించ వద్దని ఆయన సూచించారు. మొత్తం మీద చంద్రబాబు క్షేత్రస్థాయిలో వైసీపీని దెబ్బతీయడానికి రెడీ అవుతున్నారన్నమాట.
- Tags
- చంద్రబాబు

