కోహ్లీ విశ్రాంతి వెనుక ...?

నేనేమి రోబోను కాదు. నాకు విశ్రాంతి అవసరమే అంటూ ఈమధ్యే వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని సెలెక్టర్లు గౌరవించారు. శ్రీలంక తో టెస్ట్ సిరీస్ ముగిసిన తరువాత డిసెంబర్ అంతా కోహ్లీ రెస్ట్ లో వుండనున్నాడు. ఈ మేరకు సెలెక్టర్లు ప్రకటన సైతం చేశారు. కోహ్లీ కి వన్డేల్లో డిప్యూటీ గా వున్న స్టార్ బ్యాట్సమెన్ రోహిత్ కి భారత జట్టు పగ్గాలు అప్పగించారు.
రెండేళ్ళుగా నాన్ స్టాప్ ....
పరుగుల యంత్రం తయారు చేస్తే ఎలా పరిగెడుతుందో అలాగే గత రెండేళ్ళుగా కోహ్లీ విరామం ఎరుగని క్రికెట్ ఆడుతూ వచ్చాడు. టి ట్వంటీ, వన్డే, టెస్ట్, ఇవి కాక ఐపీఎల్ ఏ ఫార్మేట్ ని కోహ్లీ వదిలిపెట్టాలేదు. అలాగే ఆయా ఫార్మేట్ లలో తన సహజ సిద్ధమైన దూకుడు ఆటతో ఫాన్స్ ను హుషారు చేస్తూనే వున్నాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొడుతూ రికార్డులను తిరగరాస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తాజాగా శ్రీలంక టెస్ట్ సిరీస్ లోను సెంచరీ, డబుల్ సెంచరీలతో తన బ్యాట్ పవర్ ప్రపంచానికి చాటాడు భారత సారధి. మరీ ఇలా ఆడుతూ పోతే విశ్రాంతి ఎప్పుడు అని సన్నిహితుల సలహాతో కోహ్లీ కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రెస్ట్ కోరుకున్నాడు. అది సమంజసం అని భావించిన టీం ఇండియా సెలెక్టర్లు కోహ్లీ ని రెస్ట్ తీసుకోమని కోరాయి. దాంతో నూతన ఉత్సహంతో దక్షిణాఫ్రికా టూర్ లో సత్తా చాటేందుకు విరాట్ విశ్రాంతి కి వెళుతున్నాడు. వచ్చాకా ఏమి చేస్తాడో చూడాలి.
- Tags
- కోహ్లి

