Mon Mar 30 2026 19:32:17 GMT+0530 (India Standard Time)
కోడిపందేలపై హైకోర్టు సీరియస్...!

కోడి పందేల నిర్వహణ పై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో హైకోర్టుకు వ్యక్తిగతంగా ఏపీ చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. కోడి పందేలను ఎందుకు కట్టడి చేయలేదని హైకోర్టు సీరియస్ గా ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని తీవ్రంగా ప్రశ్నించింది. కోడిపందాలను ప్రభుత్వ ప్రతినిధులే ప్రశ్నించడం ఏంటని హైకోర్టు సీరియస్ అయింది. సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందాలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంతమందిని అరెస్ట్ చేశారని కోర్టు నిలదీసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి, డీజీపిని ఆదేశించింది. అయితే ఈ వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరడంతో హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
- Tags
- హైకోర్టు
Next Story

