Sat Apr 11 2026 10:06:21 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు ఝలక్

కోదండరామ్ సభకు మరోసారి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కొలువుల కొట్లాట సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా తాము అనుమతిని నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యానే తాము అనుమతి నిరాకరిస్తున్నామన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తమ సభకు అనుమతిని ఇప్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఒక్క జేఏసీ సభలకు, సమావేశాలకే ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారంటూ కోర్టు సర్కార్ ను ప్రశ్నించింది. నవంబరు 6వ తేదీలోగా కోర్టుకు వివరణ ఇవ్వాలనికోరింది.
- Tags
- హైకోర్టు
Next Story

