కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణలో రేషన్ షాపులను రద్దు చేయనున్నారు. ఈ ప్రతిపాదనను స్వయంగా కేసీఆర్ చేయడం విశేషం. రేషన్ షాపులను ఎత్తివేసి వాటి స్థానంలో లబ్దిదారులకు నగదును సరఫరా చేయాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారనుంది. తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా దాదాపు కోటి నలభై లక్షల కుటుంబాలు రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల సరుకులు తీసుకుంటున్నాయి. రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర, గోధుమలు వంటి వాటిని పంపిణీ చేస్తున్నారు. అయితే రేషన్ షాపుల్లో అవకతవకలపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయినా అవినీతి ఆగలేదని భావించిన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది.
రేషన్ కు బదులు నగదు....
రేషన్ షాపుల నుంచి సరుకులకు బదులుగా నగదును పంపిణీ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని కేసీఆర్ అధికారుల ముందు సరికొత్త ప్రతిపాదనలను ఉంచారు. దీనిపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కు బదులు నగదు పంపిణీ జరుగతుంది. నగదు పంపిణీలో అయితే అవకతవకలు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. నగదులో ఏదైనా అవకతవకలు జరిగిన వెంటనే లబ్దిదారులు నేరుగా ప్రశ్నించే వీలుకూడా ఉంది. దీనిపై అవసరమైన విధివిధానాలను రూపొందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశిచండం చర్చనీయాంశంగా మారింది.
- Tags
- కేసీఆర్

