కేసీఆర్ కోతుల కథ......!

పిట్ట కథలు చెబుతూ ఆకట్టుకునే అనర్గళ ప్రసంగాలు చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిన పిండి. ఆయన ప్రసంగాలు అప్రతిహతంగా సుదీర్ఘంగా సాగినా ఎక్కడా సభికులకు విసుగు పుట్టదు. చక్కని రైమింగ్ టైమింగ్ సీఎం కేసీఆర్ సొంతం. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు చక్కని జవాబులు ఇస్తూ తన ప్రసంగాలతో అల్లాడిస్తున్నారు. సబ్జెక్ట్ ఏదైనా కావొచ్చు కేసీఆర్ ప్రసంగం సభ్యులు ఆసక్తిగా వింటున్నారు. తాజాగా హరితహారం అవసరం పై కేసీఆర్ చెప్పిన కోతుల కథ అందరిని ఆకట్టుకుంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల హామీ కోతులే అన్న కేసీఆర్ ...
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏ పార్టీ అయినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు , నూతనంగా అమలు చేయబోయే పథకాలు, అభివృద్హి కార్యక్రమాలు ఉంటాయి. కానీ కోతుల బెడదపై ఎవరైనా మ్యానిఫెస్టో లో పెడతారా ? కానీ హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ప్రతి పార్టీ కోతుల బెడదను నివారిస్తామని హామీ ఇచ్చాయి. ఆ పార్టీ ఈ పార్టీ లేదు. అన్ని పార్టీలు ఆ హామీ ఇవ్వడం గమనించాలి. కోతులు కానీ ఇతర జంతువులు కానీ జనావాస ప్రాంతాల్లోకి ఎందుకు వస్తున్నాయో ఆలోచన చేయాలి. అడవులను మానవుడు నాశనం చేయడం వల్లే జీవ, పర్యావరణ సమస్య తలెత్తి అన్ని జంతువులు మనపై వచ్చి పడుతున్నాయి. అలాగే ఈతపళ్ళు ఆ పళ్ళు ఈ పళ్ళు మనచిన్నతనంలో చూసినవి ఉన్నాయా...? ఈనాడు అని ప్రశ్నించారు. వైల్డ్ ఫ్రూట్స్ లేవు వైల్డ్ లైఫ్ లేదు. అందుకే సమస్యలు . తెలంగాణ సర్కార్ అందుకే హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అన్నారు కేసీఆర్. ఆయన చెప్పిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మ్యానిఫెస్టో కోతుల వ్యవహారం ప్రతి ఒక్కరిని ఆలోచించేలా సాగడం విశేషం.
- Tags
- కేసీఆర్

