Sun Mar 29 2026 17:46:26 GMT+0530 (India Standard Time)
కేక పుట్టించిన కేకే

రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు కే.కేశవరావు కేక పుట్టించారు. ఆంధ్ర ఎంపీలకు కేకే మద్దతు తెలిపారు. తామెవ్వరి డిమాండ్లకు అభ్యంతరం తెలపడం లేదని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగితే తాము మద్దతిస్తామాన్నారు. వాళ్లు ఆందోళనచేస్తుంటే ఆర్థికమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.ఇదంతా చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు అనుమానమొస్తుందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటీనీ పూర్తి చేయాల్సిందేనని కేకే చెప్పారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలన్నారు. ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదన్నారు. తెలంగాణకు నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందన్నారు. వెల్ లోకి వచ్చిన వారి సస్పెన్షన్ విషయంలో వివక్ష తగదన్నారు. ఒకరిని సస్పెండ్ చేసి మరొకరిని వదిలేయడం తగదని కేకే అభిప్రాయపడ్డారు.
- Tags
- కేశవరావు
Next Story

