కేంద్రం చెప్పేవరకూ వీరికి తెలియదా?

దేశంలో పెద్ద సంఖ్యలో మత మార్పిడులు జరుగుతున్నాయి. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఈ మత మార్పుడిలు చేస్తున్నారు. ముఖ్యంగా అనాధ ఆశ్రమాల పేరుతో మాత మార్పిడులు జరుగుతున్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దేశంలోని ఆనాధ ఆశ్రమాలపైన నిఘా పెట్టగా హైదరబాద్ లో ఒక ఆశ్రమంలో ఈ మత మార్పిడులు పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లుగా తేలింది. గుట్టు చప్పుడు కాకుండా చిన్న పిల్లలను మాత మార్పిడులు చేస్తున్న ఈ ముఠాల సమచారాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హిందువు అయిన సత్యనారయణ కొంత కాలం క్రితం ముస్లీం మతం లోకి మారాడు. చిన్నప్పడే ఇతను మతం మార్చుకుని అదే పంధాలో కొనసాగుతున్నాడు. అయితే ఇతను రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న దారుణాలు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించి స్దానిక పోలీసులకు సమాచారం అందించారు.
అనాధాశ్రమం ముసుగులో...
మల్కాజిగిరి ప్రాంతంలో వున్న ఆర్ఫాన్ ఏజ్ సంస్థ ను సత్యనారాయణ అలియాస్ సిద్దిఖి నడుపుతున్నాడు. ఇతనిది రాజమండ్రి. ఇప్పటి వరకు వరంగల్. రాజమండ్రి. కాకినాడ, నల్గొండ , కాజీపెట్ ప్రాంతంల్లో తన అనాధ ఆశ్రమాలను నడిపిస్తున్నాడు. అక్కడ అనాధ ఆశ్రమాలను నడిపే క్రమంలో అక్కడ చేరిన పిల్లలను ముస్లిం మతంలోకి మారుస్తున్నాడు. దీనికి తోడుగా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ పెద్ద సంఖ్యలో మత మార్పిడులు చేస్తున్నాడు. ఇటివల కాలంలో హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ ఒక అనాధ ఆశ్రమంను ఏర్పాటుచేశాడు. దీనిని పది మంది కలిసి ఎర్పాటు చేసినట్లుగా డాటా క్రియేట్ చేశాడు. ఇక్కడికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇరవై మంది అనాధ పిల్లలను తీసుకుని వచ్చి వారికి మతం మార్చాడు. ఈ పిల్లలను ముస్లిం మత బోధనలు చేయడం ఆరంభించాడు.
జకీర్ నాయక్ ప్రసంగాలతో....
ముఖ్యంగా జకీర్ నాయక్ ప్రసంగాలను ఈ పిల్లలకు చూపెట్టి వారిని ప్రభావితం చేస్తున్నాడు సిద్దిఖి.. కాకినాడ, రాజమండ్రి లోని ఏజెన్సీ ప్రాంతాంలో ఉండే అనాధాలను ముఖ్యంగా ఇక్కడికి తీసుకుని వచ్చి వారిని మత మార్పిడులు చేస్తున్నాడు సిద్దిఖి.. అయితే సిద్దిఖి చేస్తున్న మత మార్పిడులను కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.. దీనితో పాటుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు . వెంటనే అధికారలు అప్రమత్తమై నిఘా పెట్టారు .ఈ అనాధ ఆశ్రమంలో పెద్ద సంఖ్యలో మత మార్పిడులు జరుతున్నట్లుగా తేలడంతో రాచకొండ పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇరవై మంది పిల్లలను స్వాధీన పరుచుకున్నారు. హిందువులు అయిన ఈ ఇరవై మంది పిల్లలను బలవంతంగా ముస్లిం మతంలో కి మార్చి వారికి నిషేధిత జకీర్ నాయక్ వంటి వారి ప్రసంగాలను చూపెడుతున్నట్లుగా తేలింది..దీంతొ సిద్దిఖితో పాటుగా తొమ్మిది మంది నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక్కడ వున్న పదిహేడు మంది పిల్లలను స్టేట్ హొంకు తరలించారు పోలీసులు.
- Tags
- మతమార్పిడులు

