Mon Apr 06 2026 09:24:10 GMT+0530 (India Standard Time)
కుట్ర జరిగిందంటున్న దీప

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో జయలలిత మేనకోడలు దీపకు భంగపాటు తప్పలేదు. ఆమె నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె ఎన్నికల అధికారులపై ఫైరయ్యారు. జయలలిత మేనకోడలు దీప గత ఏప్రిలో ఆర్కే నగర్ కు నామినేషన్ వేశారు. అప్పుడు ఆమె నామినేషన్ చెల్లింది. ఈసారి ఎందుకు చెల్లలేదని ప్రశ్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన దీప తన నామినేషన్ తిరస్కరణలో రాజకీయ కుట్ర ఉందంటున్నారు. తనకు అనేకమంది నామినేషన్ వేయవద్దని ఫోన్లు చేశారని, అయినా ధైర్యంగా నామినేషన్ వేశానని, కొందరు బెదిరించినా తాను వెనక్కు తగ్గలేదన్నారు ఆమె. అయితే తన నామినేషన్ ను ఎందుకు తిరస్కరించారో తనకు తెలియందంటున్నారు.
- Tags
- దీప
Next Story

