కిక్ లేదన్న సోమిరెడ్డి... సరదా తీరుస్తామన్న రోజా

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం గైర్హాజరు కావడంతో కిక్ లేకుండా పోయిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం, జబర్దస్త్ హీరోయిన్ కూడా లేకపోవడంతో శాసనసభ సమావేశాల్లో వినోదం లేకుండా పో్యిందని సోమిరెడ్డి చమత్కరించారు. ప్రతిపక్షం అంటే బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజాసమస్యలను చర్చించే వేదికను వదిలిపెట్టి రోడ్డున తిరగడమేంటని సోమిరెడ్డి జగన్ పాదయాత్ర నుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి వైసీపీ నేత రోజా ఘాటుగా సమాధానమిచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేకున్నా చంద్రబాబు పెరఫార్మన్స్ ఎనిమిది రోజులు బాగుందని, లోకేష్ పెర్ ఫార్మెన్స్ రెండు రోజులు బాగుందని వారికి వారే అవార్డులు నంది అవార్డులకు మించి ఇచ్చుకున్నారన్నారు. వైసీపీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామ చేయిస్తే తాము అసెంబ్లీకి వచ్చి సోమిరెడ్డి సరదా తీర్చేస్తామన్నారు రోజా.
- Tags
- రోజా
- సోమిరెడ్డి

