కిక్ కోసం ఈ ఇద్దరూ ఏం చేశారంటే...?

న్యూ ఇయర్ వస్తుంటే చాలు యువత మందు చిందులతో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఎంజాయ్ మెంట్ కు డ్రగ్స్ తోడు చేయాలని యువత ప్రయత్నాలలో వుంటారు.. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ తీసుకోవాలని యువత ఆలొచన చేస్తుంటుంది. హైదరబాద్ నగరంలో ఇప్పుడు డ్రగ్స్ విచ్చల విడిగా వస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనూమానిస్తున్నారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ తీసుకుని వస్తున్న యువకులను టాస్క్ ఫొర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూ ఇయర్ పార్టీల కోసం....
కొత్త సంవత్సరం వస్తుదంటే చాలు యువత కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలని అనుకుంటుంది. మందు... విందులతో ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన నానా హంగామా చేస్తుంటారు. కొత్తదనం కొసం ఏమైనా చేస్తుంటారు. అలాంటి యువత కోసం డ్రగ్స్ మాఫియా ఎప్పడూ సిద్ధంగానే వుంటుంది. అంతేగాకుండా కొత్త కొత్త మార్గాలలో ఈ డ్రగ్స్ తెప్పిస్తుంటారు. ఈసారి అసలు డ్రగ్స్ అని గుర్తు పట్టకుండా వుండేందుకే కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ డ్రగ్స్ నే ఇప్పుడు నగరంలోని యువతకు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో న్యూ ఇయర్ పార్టీ ల కోసం పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా సమాచారం వచ్చింది. ఈ మేరకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విక్కీ తో పాటుగా విద్యార్థి రోహిత్ లపైన నిఘా పెట్టారు. ఇద్దరు కలిసి హైదరబాద్ లోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకుని వస్తున్నట్లుగా తెలింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది.
ఎల్సీడీ.. గంజాయి.. మిక్స్ చేసి....
కిక్ కోసం వీరు కొత్త డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు. గంజాయ్ ,ఎల్ ఎస్ డి డ్రగ్స్ మిక్స్ చేసి దానిని ఒక్క ద్రవ రూపంలో తయారీ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ను చిన్న చిన్న ముద్దలుగా తయారీ చేసి విక్రయిస్తున్నారు. దీనిని అంత్యంత ఖరీదైన డ్రగ్ గా పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే ఎల్ ఎస్ డి డ్రగ్స్ కిక్ ఎక్కువగా ఇస్తుంది. అయితే దీనికి గంజాయి మిక్స్ కలిపి కొత్త డ్రగ్స్ తయారీ చేశారు. ఈ డ్రగ్స్ ను స్రీకెట్ గా తయారు చేస్తున్నారు. గోవాకి వెళ్లి అక్కడి నుంచి ఎల్ఎస్ డి డ్రగ్స్ తీసుకునని వస్తున్నారు.అలాగే విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి ని తెప్పిస్తున్నారు ఈ రెండింటిని సికింద్రా బాద్ ఏరియాలో వున్న ఒక ఇంట్లో డ్రగ్స్ గా తయారు చేసి విక్రయాలు చేస్తున్నారని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇవి అంత్యంత ప్రమాదరకరమైన డ్రగ్స్ అని. దీనిని ఒక్కసారి వాడితే పూర్తిగా దీనికే అలవాటు పడి పొతారని.. అంతేగాకుండా దీని మత్తు కూడా పెద్ద మొత్తంలో వుంటుందని టాస్క్ పొర్స్ పోలీసులు తెలిపారు. ఇదిలా వుంటే ఈ డ్రగ్స్ నగరంలోని వ్యాపారవేత్తలతో పాటుగా బంజారాహిల్స్ లోని కొంత మంది కి వీరు సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరిని జూబ్లిహిల్స్ పోలీసులకు అప్పగించారు. సినిమా రంగంలోని కొంత మందికి వీరు టచ్ లో వున్నారని పోలీసులు అనూమానిస్తున్నారు.
- Tags
- డ్రగ్స్

