Wed Feb 04 2026 16:26:06 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో కోమటిరెడ్డిపై నిర్ణయం

కాంగ్రెస్ నేత కోమటిరెడ్డిపై చర్యలు తప్పవా? నిన్న సభలో మైక్ విసరడంతో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు గాయాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ ప్రారంభమయిన వెంటనే దీనిపై స్పీకర్ మధుసూధనాచారి ఒక ప్రకటన చేసే అవకాశముంది. నిన్న రాత్రి వీడియో ఫుటేజీని అడ్వకేట్ జనరల్ సమక్షంలో అసెంబ్లీ అధికారులు పరిశీలించారు. న్యాయపరమైన సలహాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, వంశీచందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేసే అవకాశముంది. అయితే కాంగ్రెస్ సభ్యులందరినీ ఈ సమావేశాల వరకూ సస్పెండ్ చేసే మరో ప్రతిపాదనను కూడా స్పీకర్ పరిశీలిస్తన్నట్లు తెలుస్తోంది. నిన్న గాయాలపాలైన స్వామిగౌడ్ సరోజినీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరికాసేపట్లో స్పీకర్ నిర్ణయం వెలువడనుంది.
- Tags
- కోమటిరెడ్డి
Next Story
