కాపులకు తీపి కబురు

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ తెచ్చింది. కాపు రిజర్వేషన్లపై జస్టిస్ మంజునాధ కమిషన్ ఇచ్చిన నివేదికను నేటి మంత్రివర్గ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా చేర్చారు. దీన్ని కాబినెట్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్ల అంశంపై చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. గత ఎన్నికలకు ముందు మేనిఫేస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముద్రగడ ఆందోళనల నేపథ్యంలో మంజునాధ కమిషన్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరోవైపు ముద్రగడ దీనిపై ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. డిసెంబర్ 6వ తేదీ ఆఖరి గడువుగా ముద్రగడ ప్రకటించారు. ఈలోపే కాపురిజర్వేషన్లపై మంజునాధ కమిటీ నివేదిక ఇచ్చింది. రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి కాపుల పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని ఏపీ సర్కార్ నిరూపించుకోనుంది. బీసీలకు రిజర్వేషన్లలో ఎలాంటి అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అలాగే వాల్మీకీ, బోయ కులస్థులను కూడా ఎస్టీల్లోకిచేరుస్తూ మంత్రి వర్గం ఆమోదించింది. దీనిపై కూడా తీర్మానంచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. అయితే కాపులకు కేవలం విద్యా, ఉపాధి రంగాల్లోనే రిజర్వేషన్లుంటాయి.

