Wed Feb 04 2026 22:08:53 GMT+0000 (Coordinated Universal Time)
కాణిపాకంలో కామినేని ప్రమాణం

తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అవినీతిని దరిచేరనివ్వలేదని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కాణిపాకం వినాయకుడి ఆలయంలో ప్రమాణం చేశారు. కామినేని మంత్రిపదవికి రాజీనామా చేసినప్పుడే అసెంబ్లీలో ఈ విషయం చెప్పారు. తాను పైసా కూడా అవినీతికి పాల్పడలేదని, ఈ విషయాన్ని వరసిద్ది వినాయకుడి వద్దనే ప్రమాణం చేస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే ఈరోజు కాణిపాకం వెళ్లిన కామినేని తాను ఎలాంటి లంచాలకు పాల్పడలేదని ప్రమాణం చేశారు.
Next Story
