Thu May 02 2024 05:50:04 GMT+0000 (Coordinated Universal Time)
కాటమరాయుడి కంటే పవన్ కు ఇష్టమైనదేంటంటే...?
కాటమరాయుడు సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురువారం పూణే వెళ్లారు. తన కూతురు ఆద్య పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. రేణూదేశాయ్ తో కలిసి ఆద్య పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్, ఆద్య స్నేహితులతో కూడా చాలాసేపు గడిపారు. కాటమరాయుడు విడుదలకు ముందురోజు పవన్ తన కూతురి పుట్టిన రోజున రావడం పట్ల రేణూ దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగిన నిజైమన బహుమతి అంటూ రేణూదేశాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story