Sat Apr 11 2026 05:07:19 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ లోకి మరో మాజీ ఎమ్మెల్సీ

గతంలో టీడీపీలోనూ, ప్రస్తుతం టీఆర్ఎస్ లోనూ ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పోట్ల కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అయితే తాజాగా జరగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఖమ్మం అసెంబ్లీ టిక్కెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల8వ తేదీన పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Next Story

