కాంగ్రెస్ యాక్షన్ షురూ

11 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, ఇద్దరు సభ్యుల శాసనసభ్యత్వం రద్దుతో తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ నిరసనలు దిగారు. ఎక్కడికక్కడ జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఈ అంశంతోనే ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.
అధిష్టానం అనుమతి వచ్చే వరకూ....
ఇందుకోసం ప్రత్యేకంగా మరోసారి సీనియర్ నేతలు సమావేశమయ్యారు. మూకుమ్మడి రాజీనామాల విషయంపై అధిష్టానం నుంచి అనుమతి వచ్చే వరకూ వేచి చూడాలని నిర్ణయించారు. దీంతో పాటుగా బుధవారం అన్ని జిల్లాల్లో పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని, జానారెడ్డి లాంటి సాధుస్వభావిని కూడా సస్పెండ్ చేశారంటే... అధికార పార్టీ ఎంతటి దారుణాలకు పాల్పడుతుందో ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. ఇది కూడా తమ మంచికే జరిగిందని అభిప్రాయపడుతున్నారు.
నల్లగొండ, పాలమూరులో అప్రమత్తం.....
శాసనసభలో జరిగిందొకటి, ప్రభుత్వం చెబుతుందొకటి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. స్వామిగౌడ్ కు గాయమేదీ కాకపోయినా ముఖ్యమంత్రి డ్రామా సృష్టించారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గవర్నర్ ను సాగనంపేంత వరకూ స్వామిగౌడ్ బాగానే ఉన్నారని, ఆ తర్వాత ఆయన గాయం విషయం బయటకు వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేయడంపై 48 గంటల దీక్షకు దిగారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుకూడా దీక్షలో పాల్గొన్నారు. వీరిద్దరి సభ్యత్వాలను నిరసిస్తూ నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. నిషేధాజ్ఞలు విధింాచరు.
- Tags
- కాంగ్రెస్
