Sat Apr 04 2026 14:15:10 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ కు భలే మంచిరోజు...!

అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మరికాసేపట్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. తల్లి సోనియా గాంధీ నుంచి ఈ బాధ్యతలను ఏఐసీసీ కార్యాలయంలో పగ్గాలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో సందడి నెలకొంది. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సందడి చేస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దయెత్తున హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. యువజన కాంగ్రెస్ నేతల హడావిడి ఇక చెప్పనవసరం లేదు. రాహుల్ యువనాయకత్వంలో పార్టీ విజయపథంలో దూసుకెళుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- రాహుల్ గాంధీ
Next Story

