Fri Apr 03 2026 02:22:48 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ కు చావుదెబ్బ

కాంగ్రెస్ కు ఇంకా కష్టాలు వీడినట్లు లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మేఘాలయకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడం సంచలనం కల్గిస్తోంది. రాజీనామా చేసిన వారిలో ఉప ముఖ్యమంత్రి రోవెల్ లింగోడ్ కూడా ఉండటం విశేషం. మేఘాలయలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అరవై మంది శాసనసభ్యులున్న మేఘాలయలో కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరంతా నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నారు. వచ్చే ఏడాది మేఘాలయ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది.
- Tags
- కాంగ్రెస్
Next Story

