Tue May 07 2024 01:11:05 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు కావాలి...ఒక బాహుబలి
కాంగ్రెస్ పార్టీకిని తెలంగాణాలో గెలిపించడానికి బాహుబలి వస్తాడని సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి అభిప్రాయపడ్డారు. జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెట్టినా...అక్కడ ఓటమి తప్పడం లేదని, ఆయనది ఐరన్ లెగ్ అని విమర్శలు వస్తున్నాన్న దానిపై జానారెడ్డి స్పందించారు. రాహుల్ ఐరన్ లెగ్గో కాదో భవిష్యత్తులో తేలుతుందన్నారు.
ఆదర్శ రాజకీయాలకు తాను విత్తనం లాంటి వాడినన్నారు. ఇకపై తాను బడ్జెట్ పై అసెంబ్లీలో మాట్లాడబోనని జానారెడ్డి తెగేసి చెప్పారు. అన్నీ తప్పుడు లెక్కలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, ఎన్ని సార్లు చెప్పినా అవే లెక్కలు చెబుతూ..తప్పుదోవ పట్టిస్తున్నారని జానా ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్ లో తాను కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారన్నారు జానా.
- Tags
- జానారెడ్డి
Next Story