Sat Apr 11 2026 21:21:41 GMT+0530 (India Standard Time)
కవిత పార్టీ మారుతున్నారు...!

సినీనటి కవిత పార్టీ మారతున్నారు. ఆమె టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీలో కవిత క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కవితను పట్టించుకోవడం మానేశారు. విశాఖలో జరిగిన మహానాడులో కూడా తనకు వేదికపైకి పిలవకపోవడంపై కవిత కన్నీరు మున్నీరయ్యారు. అప్పుడే ఆమె టీడీపీపై విమర్శలుచేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కవిత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను కలిశారు. బీజేపీలో చేరేందుకు కవిత ఆసక్తి చూపుతున్నారు. బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే తెలియజేస్తామన్నారు కవిత.
- Tags
- కవిత
Next Story

