Wed Feb 04 2026 10:35:57 GMT+0000 (Coordinated Universal Time)
కడప వాసులకు శుభవార్త

కడప వాసులు త్వరలోనే శుభవార్త వింటారని పార్లమెంటు సభ్యుడు హరిబాబు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక వచ్చిందని, త్వరలోనే కేంద్రం నుంచి కడప స్టీల్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పారు. ప్రత్యేక హోదా తప్ప రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని హరిబాబు తెలిపారు. బీజేపీపై లేని పోని నిందలు వేయడం తగదన్నారు. ఓపిక పడితే అన్నీ ఒక్కొక్కటిగా అమలవుతాయని హరిబాబు చెప్పారు.
Next Story
