కంగనాకు మణికర్ణిక సెట్స్ లో గాయం?

బాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో మణికర్ణిక సినిమా రూపు దిద్దుకుంటుంది. చారిత్రక నేపధ్యం గల వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మణికర్ణిక టైటిల్ రోల్ ని కంగనా పోషిస్తుంది. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మి భాయ్ రాజ్యం కోసం పోరాటాలు చేస్తుంది. అలాగే మాణికర్ణికలో కూడా కంగనా రనౌత్ ఇలాంటి కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు చెయ్యాల్సి ఉంటుంది. సినిమా మొదలెట్టకముందే యుద్ధ విద్యల్లో నైపుణ్యాన్ని సంపాదించిన కంగన మణికర్ణిక యాక్షన్ పార్ట్ లో ఉత్సాహంగానే పాల్గొంది.
అయితే కంగనకి మణికర్ణిక సెట్స్ లో ఒక ప్రమాదం జరిగి కాలికి దెబ్బ తగిలింది. జైపూర్ లోని ఓ కోటలో కంగనాపై భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తుండగా.. కంగనా కాలికి గాయమైందని సమాచారం. ఝాన్సీ లక్ష్మి భాయ్ పాత్రలో నటిస్తున్న కంగనా ఈ సినిమాలో తన దత్త పుత్రుడు ని వెనుక వీపుకు కట్టుకుని యుద్ధం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఎత్తైన గోడ పైనుండి దూకే సమయంలో కంగనా వెనుక ఉన్న బిడ్డ జారిపడడంతో.. కంగనా ఆ బిడ్డని కాపాడే ప్రయత్నంలో దూకెయ్యడంతో.. ఆమె కాలికి గాయమైందంటున్నారు. కానీ ఆ ప్రమాదంలో బిడ్డ సేఫ్ అంటున్నారు.
అయితే కంగనాకు మణికర్ణిక షూటింగ్ లో ఇదే మొదటి ప్రమాదం కాదు. ఇంతకుమునుపు కూడా కంగనాకు మాణికర్ణిక్స్ సెట్స్ లో గాయమైంది. ఓ కత్తియుద్ధం సీక్వెన్స్ చేస్తున్న సమయంలో లో ప్రమాదవశాత్తూ కంగనా నుదిటిపై ఒక గీత పడింది. అయితే ఇప్పుడు మాత్రం కంగనాకు గట్టి దెబ్బె తగలడంతో.. మణికర్ణిక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి కంగనా ముంబై కి వచ్చేసింది రెస్ట్ తీసుకోవడానికి. అయితే కంగనాకు దెబ్బతగిలినా మణికర్ణిక షూటింగ్ కి పెద్ద ఇబ్బంది ఉండదంటున్నారు చిత్ర బృందం. ఇప్పటికే యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. ఇక మిగిలినదంతా.. డ్రామా పార్ట్ మాత్రమే అంటుంది.

