Sun Apr 12 2026 15:22:43 GMT+0530 (India Standard Time)
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఐదు మృతదేహాలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ సమీపంలోని కొల్లూరు సమీపంలో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు, ఒక పురుషుడి డెడ్ బాడీలు దొరికాయి. మృతులంతా అమీన్ పూర్ వాసులుగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభాకరరెడ్డి ఆర్థికంగా ఇబ్బందులకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు ప్రభాకర్ రెడ్డి, మాధవి, వర్షిత్, లక్ష్మి, సింధూజగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో పాయిజన్ తీసుకుని వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు.
Next Story

