ఒకవైపే చూశారు... రెండో వైపు చూడండంటున్న బాలయ్య

ఫ్యాన్స్ ను తన చేతి షాట్స్ తో దడదడలాడిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ రూటు మార్చారు . ఇప్పుడు ఆపన్నులను అభాగ్యులను అక్కున చేర్చుకుని వారి నోట్లో ముద్దలు పెడుతూ ఆప్యాయంగా వారితో సన్నిహితంగా వున్న ఫోటోలను పసుపు పార్టీ సోషల్ మీడియా కు విడుదల చేసింది. ఆయనపై వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని కంట్రోల్ చేసే నష్ట నివారణ చర్యలు మొదలయ్యాయి. అందులో భాగంగా బాలయ్య ఇంకో వైపు చూపించే పనిలో ఆయన ఫ్యాన్స్ కష్టపడుతున్నారు. ఎక్కడికక్కడ మా బాలయ్య పేదల మనసు ఎరిగినవాడు అనే చూపించేందుకు ఒక సెక్టార్ మీడియా కూడా తెగ శ్రమ పడుతుంది.
బాలయ్యపై మళ్ళీ పేలుతున్న సెటైర్స్ ...
మీద పడే అభిమానులను ఉతకడం , నచ్చితే అక్కున చేర్చుకోవడం బాలయ్య స్టైల్ అనే రేంజ్ లో ఈ ప్రచారం సాగుతున్నా నెటిజెన్స్ మాత్రం ఈ పిక్చర్స్ పై సెటైర్స్ మీద సెటైర్స్ పేల్చేస్స్తున్నారు. బాలయ్య మనసున్న మా రాజు అనే పోస్ట్ లకు కౌంటర్ కామెంట్స్ దారుణంగా పెడుతున్నారు. బాలయ్య చేసే డామేజ్ చంద్రబాబు మీద పడకుండా జాగ్రత్త పడాలని కొందరు, ఎన్ బికె ప్రజా జీవితంలో వున్నప్పుడు తగిన విధంగా నడుచుకుని పదిమందికి ఆదర్శంగా నిలవాలని ఇంకొందరు , కొట్టడం తిట్టడం వల్ల ఆయన వ్యక్తిత్వానికి జరుగుతున్న డ్యామేజ్ ఎన్టీఆర్ ఇమేజ్ మంటగలుస్తున్నాయని మరికొందరు సూచనలు చేస్తున్నారు . మొత్తానికి చెడు అయినా మంచి అయినా బాలకృష్ణ ఏమి చేసినా ఆ వార్తలు సోషల్ మీడియా లో దూసుకుపోవడం విశేషం. రాబోయే ఎన్నికల లోపు బాలయ్య ఇంకెన్ని సిత్రాలు చూపిస్తారో మరి.
- Tags
- బాలకృష్ణ

