Wed Feb 04 2026 10:35:54 GMT+0000 (Coordinated Universal Time)
ఒకవైపు జగన్...మరోవైపు పవన్...మధ్యలో బీజేపీ

దేశంలో యాంటీ బీజేపీ, యాంటీ మోడీ విపరీతంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ విధానాల వల్లనే నిన్న యూపీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నారు. ఆయన సీనియర్ నేతలతో పవన్ కల్యాణ్, ప్రత్యేక హోదా వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఒకవైపు, పవన్ ను మరోవైపు అడ్డం పెట్టుకుని బీజేపీ డ్రామాలాడుతుందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వెనక బీజేపీ ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమిళనాడులో కూడా ఇదే తరహాలో బలమైన ప్రాంతీయ పార్టీని బీజేపీ బలహీనపర్చేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే వీలయినంత త్వరగానే ఎన్డీఏ నుంచి తప్పుకోవాలని ఆయన భావిసున్నట్లు తెలిసింది.
Next Story
