ఐలయ్యకు మావోయిస్టుల మద్దతు

ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు తాజాగా మావోయిస్టు లు మద్దతుగా నిలిచారు. ఆయన రచించిన కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్య వైశ్యులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే . ఆర్య వైశ్యుల డిమాండ్ కి తలొగ్గి ఆంధ్రప్రదేశ్ లో ఆ పుస్తకాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణాలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ టిఆర్ ఎస్ వర్గాలు ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులకు మద్దత్తుగానే ప్రతిస్పందిస్తున్నాయి. దాంతో రోజు రోజుకు ఈ వివాదం పెరుగుతూనే వస్తుంది.
భావప్రకటనా స్వేచ్ఛ హరిస్తున్నారన్న మావో జగన్ ...
ఇదిలా ఉండగా తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర ప్రతినిధి జగన్ ప్రొఫెసర్ ఐలయ్య కు మద్దతుగా లేఖ విడుదల చేశారు. తెలంగాణ లో భావ ప్రకటన స్వఛ్చను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఏపీలో టిడిపి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని తప్పు పట్టారు. ఐలయ్య పై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేసేలా కొందరు చేస్తున్నారని చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ హిందూ ఫాసిస్ట్ ధోరణిని అమలు చేయడానికి ప్రయత్నంచేస్తోందని విమర్శించారు. మరోవైపు ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కోర్ట్ చర్యలు తీసుకోవాలని ఆయన పై కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. .
- Tags
- కంచె ఐలయ్య

