Sun Mar 29 2026 15:58:23 GMT+0530 (India Standard Time)
ఏపీ రాజకీయాలపై జగన్ లేటెస్ట్ ట్వీట్ ఇదే...!

ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా ను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. విభజన జరిగే సమయంలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కే్ంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా అప్పటి పాలక, విపక్షాలు ఏపీకి మాటిచ్చాయన్నారు. మార్చి 2014 లో కేంద్రమంత్రి వర్గం ఇదే అంశాన్ని ఆమోదించిందని, ప్రత్యేక హోదా అమలు అంశాన్ని ప్రణాళిక సంఘానికి పంపిన విషయాన్ని కూడా జగన్ గుర్తు చేశారు. అయితే ఏ నైతిక విలువలతో చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఏమిస్తారో తెలియని ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఇప్పటికైనా కంటితుడుపుచర్యలు ఆపి, ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని జగన్ నిలదీశారు.
- Tags
- జగన్ ట్వీట్
Next Story

