ఏపీ అసెంబ్లీలో టిడిపి, బిజెపి అలా....!

వైసిపి పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒక్కోసారి మరీ చప్పగా సాగుతున్నాయి. అదే విపక్షంగా వైసిపి వున్నప్పుడు సభ వాడిగా వేడిగా సాగేది. ఇక్కడ అధికార విపక్ష బాధ్యతలు ఒక్కరే వ్యవహరించడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురౌతుంది. విపక్షం కూడా మనమే అన్న చంద్రబాబు వ్యాఖ్యలు పట్టుకుని కొందరు సీనియర్లు సర్కార్ తీరును మంత్రుల నిర్లక్ష్యం కడిగేస్తుంటే అది టిడిపికే మైనస్ గా పరిణమిస్తుంది. మరోవైపు బిజెపి ఈ స్కూల్ లో తనపాత్ర తానూ పోషిస్తుంది.
ఆరోగ్య రక్షకు ప్రచారం తక్కువైపోయిందిట...
ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య రక్షా పధకానికి ప్రచారం తక్కువైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు. అందరికి ఉపయోగపడే ఇలాంటి పధకాలు ఎందుకు తగిన విధంగా ప్రచారం చేయడం లేదంటూ ఆయన నిలదీశారు. పధకంలో నమోదు కావడంలో సైతం సాంకేతిక సమస్యలు ఎదురు అవుతున్నాయంటూ సీరియస్ అయ్యారు. ఈ ప్రశ్నకు సమాధానం తమ పార్టీ కి చెందిన మంత్రి కామినేని సమాధానం చెప్పేలా విష్ణుకుమార్ రాజు వ్యవహరించారు. వెంటనే మంత్రి కామినేని అవసరమైనంత ప్రచారం కల్పిస్తామని పధకం తొలగిస్తారన్న ప్రచారం నమ్మొద్దని జవాబు ఇచ్చారు. ప్రధాన పక్షం వైసిపి లేకపోవడంతో గొడవ గోలా లేకుండా టిడిపి బిజెపిలు తమకు నచ్చిన అంశాలు ఎంపిక చేసుకుని ఇలా బండి లాగించడం విశేషం.
- Tags
- ఏపీ అసెంబ్లీ

