Tue Mar 31 2026 05:38:08 GMT+0530 (India Standard Time)
ఎస్ఐకి పవన్ ఎస్ఎంఎస్...!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం పర్యటనలో ఉండగా పవన్ ప్రయాణిస్తున్న కారు ఎస్ ఐ కాలు మీద నుంచి వెళ్లింది. ఖమ్మం రూరల్ ఎస్ఐ చిరంజీవి పవన్ టూర్ లో విధులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. పవన్ కారుపై పడుతున్న అభిమానులను పక్కకు నెడుతుండగా ఎస్ఐ చిరంజీవి కాలు మీదకు పవన్ కారు వెళ్లింది. దీంతో ఎస్ఐ కాలి మడమ విరిగింది. ఈవిషయాన్ని తర్వాత తెలుసుకున్న పవన్ వెంటనే ఎస్ఐ చిరంజీవికి మెసేజ్ పెట్టారు. తాను సమావేశంలో ఉన్నందున కలవలేకపోతున్నానని, తన పర్సనల్ సెక్రటరీని పంపుతున్నానని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రావాలని పవన్ ఎస్ఐకి మెసేజ్ పెట్టారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story

