Mon Apr 13 2026 03:03:31 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే సంపత్ కు అవమానం

ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతటా కొత్త జిల్లాల కలెక్టరేట్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. మిగిలిన చోట్ల మంత్రులు శంకుస్థాపన కార్యక్రమాల్లోపాల్గొన్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టరేట్ భవన సముదాయానికి శంకుస్థాపనకు వచ్చిన ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. ఆయన పేరు శిలాఫలకంపై లేకపోవడంతో ఆయన ఆగ్రహించి అక్కడినుంచి వెళ్లిపోయారు. సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు పేర్లు శిలాఫలకంపై ఉండాలి. కాని శిలా ఫలకంపై పేరు లేకుండా తనను అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సంపత్ కుమార్ తెలిపారు.
- Tags
- సంపత్ కుమార్
Next Story

