Thu Apr 02 2026 10:26:26 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే చెన్నమనేనికి ఊరట

వేములవాడ చెన్నమనేని రమేష్ కి ఊరట లభించింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదంటూకేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆరు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసత్వంపై రద్దు ఏకపక్షమని హైకోర్టు అభిప్రాయపడింది. మరోసారి వాదనలు వింటామని హైకోర్టు చెప్పింది. చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఉంది. ద్వంద పౌరసత్వాలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ఇటీవల రద్దు చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
- Tags
- చెన్నమనేని రమేష్
Next Story

