Sun Mar 29 2026 19:26:50 GMT+0530 (India Standard Time)
ఎంపీ గీత సంచలన వ్యాఖ్యలు...!

అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు టీడీపీని, అటు వైసీపీపై దుమ్మెత్తి పోశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పకుండా పార్లమెంటులో నిరసనలు తెలిపితే ఏం లాభమని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం తమకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని చెబుతుందని, అయితే ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పడం లేదని గీత అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు. అలాగే వైసీపీ అధినేత జగన్ కేంద్రాన్ని తిట్టడం మానేసి రాష్ట్రాన్ని, చంద్రబాబును విమర్శించడంలో ప్రయోజనం ఏంటని గీత ప్రశ్నించారు. కేంద్రంనిధులకు రాష్ట్రం ఎందుకు లెక్కలు చెప్పడం లేదు. ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారన్నారు. అలాగే పోలవరానికి పెట్టిన ఖర్చులకులెక్కలేవన్నారు. రెండంకెల వృద్ధి సాధించామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి నిధులు అడగే అర్హత ఎక్కడుందన్నారు గీత.
- Tags
- ఎంపీ గీీత
Next Story

