ఉద్యమం ఆగదంటున్న ముద్రగడ ...!

కాపులకు 5 శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విభిన్నంగా స్పందించారు. విద్యా ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కావాలి. రాజకీయ రిజర్వేషన్లు కావాలి. తక్షణం బీసీలుగా గుర్తిస్తూ తహశీల్దారు కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. కేంద్రానికి తీర్మానం పంపి అక్కడ 9 వ షెడ్యూల్ లో చేర్చాలిసిన భాద్యతా చంద్రబాబు దే. అప్పటివరకు ఉద్యమాన్ని లైవ్ లో ఉంచుతాం అంటూ తాజాగా మీడియా ముందు తన వైఖరి స్పష్టం చేశారు ముద్రగడ పద్మనాభం.
లెక్క ఎందుకు తప్పు గా ఇచ్చారు ...
మంజునాథ కమిషన్ కి ప్రభుత్వం ఇచ్చిన కాపు జనాభా లెక్కలు తప్పుల తడక గా అభివర్ణించారు ముద్రగడ. రాష్ట్రంలో సుమారు కోటి ముప్పై లక్షల మంది జనాభా కాపులు వున్నారని వీరిని తగ్గించి చూపాలనుకోవడం సరైన విధానం కాదన్నారు. అంతమంది వుంటే ఐదు శాతం రిజర్వేషన్లు ఎక్కడ సరిపోతాయని ప్రశ్నలు వేశారు.
రాష్ట్రంలో 8.7శాతం మందే కాపులు ....
మరో వైపు మంత్రి అచెంనాయుడు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల అంశంపై తీర్మానం ప్రవేశ పెట్టేముందు కాపు జనాభా లెక్కలు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కాపులు 38 లక్షలు ఉన్నారన్నారు. ఇది జనాభాలో 8.7 శాతంగా అచ్చెన్న పేర్కొన్నారు. మరో వైపు మంత్రి నారాయణ కమిషన్ ఛైర్మెన్ మంజునాథ నివేదిక ఇవ్వకపోయినా ఆ కమిషన్ లో వున్న మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం ముందుకు వెళ్ళమని ఇది సాంకేతికంగా ఇబ్బంది కాదన్నారు. ఇంకోవైపు టిడిపికి చెందిన తెలంగాణ ఎమ్యెల్యే, బిసి నేత ఆర్ కృష్ణయ్య రిజర్వేషన్ ల అంశంపై భగ్గుమన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా సొంత పార్టీ నే హెచ్చరించారు
- Tags
- ముద్రగడ

