Thu Mar 26 2026 04:08:22 GMT+0530 (India Standard Time)
ఉగాది పండక్కి అత్తారింటికి వచ్చి భార్య పిల్లలను?

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి శివ నారాయణ పురం సాయి ప్రభు కాలనీ దారుణం చోటు చేసుకుంది. భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఒక వ్యక్తి. తెల్లపల్లికి చెందని సురేందర్ తనభార్య వరలక్ష్మి, ఇద్దరు పిల్లలు నితీష్ (5). యశాశ్విని (3) తీసుకుని ఉగాది పండక్కి మీర్ పేట శివనారాయణపురంలోని అత్తగారింటికి వచ్చారు. సురేందర్ సొంతగ్రామం లింగంపల్లి. అయితే అత్త ఊరెళ్లడం, మామ బయటకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సురేందర్ ఈరోజు ఉదయం భార్యను, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్యలకు కారణం కుటుంబ కలహాలేనని పోలీసులు చెబుతున్నారు.
- Tags
- పిల్లల హత్య
- భార్య
Next Story

