Thu Mar 26 2026 17:27:03 GMT+0530 (India Standard Time)
ఈరోజు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాం

తాను గజ్వేల్ లో పర్యటించినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు దిగారని శాసన సభ్యత్వాన్ని కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నిరంకుశ విధానాలకు ఇది నిదర్శనమన్నారు. ఈరోజు తాము సంచలన నిర్ణయం తీసుకుకోబోతున్నామన్నారు. త్వరలోనే నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పర్యటిస్తారని ఆయన చెప్పారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తే మిగిలిన ఎమ్మెల్యేలు సభలో ఉండి ఏంచేస్తారని ప్రశ్నించారు. మూకుమ్మడి రాజీనామాలకు నిర్ణయం తీసుకున్నామని, దీనిపై ఏఐసీసీ సానుకూలంగా స్పందిస్తుందని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శాసనసభ్యత్వాన్ని కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు గాంధీభవన్ లో దీక్ష కొనసాగిస్తున్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Next Story

