ఈరోజు బయటకు రావద్దు ప్లీజ్....!

రెండు వేల మంది ప్రతినిధులు.. పదకొండు వేల మంది పోలీసులు. అడుగడునా నిఘా వర్గాలు. ఎక్కడ పడితే అక్కడ సిసి కెమోరాలు.. అడుగు ఒక్కటి చొప్పున పోలీసు డాగ్. ప్రతి దగ్గర బాంబు స్వ్కాడ్స్.. మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు. అనూమానితుడు కనబడితే చాలు కుమ్మి బయట పడేయడానికి మఫ్టీలో పోలీసులు.. వందల సంఖ్యలో పోలీసుల వాహనాలు. ఏచిన్న సంఘటన జరిగినా క్షణాల్లో వచ్చేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్ లు..ప్రధాని మోడీతో పాటుగా అమోరికా అధ్యక్షుడు సలహాదారాలు.. ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని నడుపుతున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు.. ప్రపంచంలోని టాప్ పారిశ్రామిక వేత్తలునేడు హైదరాబాద్ కు వచ్చేశారు. అంతేగాకుండా స్టార్టప్ కంపెనీలతో క్యూలు కట్టిన యువ పారిశ్రామిక వూత్తలు.. ఏది ఏమైనా ఇప్పడు ట్రంప్ కూతురు ఇవాంకా రాక తో ఇప్పడు హైదరబాద్ మొత్తం మెరిసిపొతుంది. ఎక్కడ చూసినా పోలీసులే దర్శనం ఇస్తున్నారు. హైదరబాద్ నగరం మొత్తం కూడా ఇప్పడు పోలీసులతోనే నిండిపొయింది. అయితే దీనికి తొడుగా అంతర్జాతీయ సదస్సు ఆరంభం అయిన తరు వాత విఐపిలు క్యూ కడతారు.
ఐదు కాన్వాయ్ లతో....
మొత్తం ఐదు క్వానాయ్ లు హైదరబాద్ ప్రజలకు చుక్కలు చూపబొతున్నాయి. ప్రధాని మోడీ.. ఇవాంక, ముఖ్యమంత్రి, గవర్నర్. ముఖేష్ అంబానీలతో పాటుగా వంద మంది మన దేశంలోని ప్రముఖుల కాన్వాయ్ మన రొడ్లు మీద తిరుగుతాయి... రెండు వేల మూడు వందల ప్రపంచ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు పాలు పంచుకొబొతున్నారు.. ఇంత చేస్తుంటే మరి ట్రాఫిక్ సంగతి ఏమిటని అనుమానం రావచ్చు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి హైదరబాద్ ప్రజలు చుక్కలు చూడబొతున్నారు.ఎందుకంటే ఇంత మంది విఐపిలు మాదాపూర్ నుంచి పాతబస్తీలోని ఫలక్ నూమాకు వస్తున్నారు. ఇందులో ఐదు కాన్వాయ్ లను గ్రీన్ చానల్ ద్వారా తీసుకుని వస్తున్నారు. దీనికి తోడుగా పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన మరొక కాన్వాయ్ వుంటుంది.. దీంతో పాటుగా సదస్సు లో పాలుపంచుకొవడానికి వచ్చిన రెండు వేల మందిని వివిధ బస్సుల్లో ఫలక్ నూమాకు తీసుకుని వస్తున్నారు.
షాపులు బంద్... ట్రాఫిక్ మళ్లింపు...
అయితే మాదాపూర్ నుంచి ఫలక్ నూమా వరకుఏమి చేయబొతున్నారు. దాదాపుగా నలభై నిమిషాల పాటు ప్రయాణం వుంటుంది. అయితే మాదాపూర్ నుంచి ఫలక్ నూమా వరకు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు వుండబోతున్నాయి. సాయింత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ట్రాఫిక్ అంక్షలు ఉంటాయి. దీనితో పాటుగా ఈ కాన్వాయ్ లు వేళ్లే మార్గంలో షాపులతో పాటుగా కమర్షియల్ ఏరియాలనుక్లోజ్ చేయాలని పోలీసులు సలహా ఇచ్చారు. కాన్వాయ్ వేళ్లే ప్రధాన మార్గంలో దాదాపుగా నలభైకి పైగా ఫంక్షన్ హాల్స్ వున్నాయి. నేడు అన్ని ఫంక్షన్ హాల్స్ లో కూడా వివాహాలు వున్నాయి. ఈ వివాహానికి వచ్చే వారు ఐదు గంటలో పు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే వివాహ బారాత్ లాంటికి అనుమతి లేదని చెప్పారు. చాంద్రాయణగుట్ట ను పోలీసులు మొత్తం ప్యాక్ చేయబోతున్నారు. అలాగే ఫలక్ నూమ్ ప్యాలెస్ కు చుట్టురా రెండు కిలో మీటర్లు పరిధిలో మొత్తం ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఫలక్ నూమా మీదుగా ఎలాంటి వాహనాలకు అనుమతి వుండదు.. అలాగే ఎల్ బినగర్. కేశవ గిరి .చార్మినార్ ల నుంచి ఫలక్ నూమా వైపుగా వచ్చి వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో ప్రజలందరు కూడా పోలీసులు సూచించిన దారిలో నే వేళ్లే వలసి వుంటుంది. అలాగే ఎయిర్ పొర్టు కు వెళ్లే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకొవాలని .లేకుండా ముందస్తుగా వెళ్లిపొవాలని చెబుతున్నారు. ఎది ఎమైనా ఇవాంక వస్తున్న నేపథ్యంలో సిటీ లో పోలీసులు పెట్టే ట్రాఫిక్ అంక్షలు ప్రజలకు చుక్కలు చూపబోతున్నాయి.

