Wed Mar 25 2026 09:39:19 GMT+0530 (India Standard Time)
ఈరోజు చర్చకు రాకుంటే.. ఇక.?

కేంద్రంపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎంలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈరోజైనా సభలో చర్చకు వస్తుందా? అందుకు అనుకూలమైన వాతావరణం సభలో ఉందా? ఎనిమిది పార్టీలు ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాయి. ఈరోజు కూడా వైసీపీ, టీడీపీలు అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. సభ ఈరోజు జరగకుంటే మళ్లీ ఇక సోమవారమే. ఈ వారంలో సభ జరగడానికి ఇదే చివరి రోజు. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ఈరోజు చర్చకు రాకుంటే ఇక సోమవారం వరకూ అవిశ్వాసం తీర్మానం చర్చకు వచ్చే అవకాశం లేదు. అయితే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన విరమించి సభ సజావుగా జరగడానికి సహకరిస్తారా? లేదా? అన్నది చూడాలి. నిన్న అన్ని పక్షాలతో సమావేశమైన స్పీకర్ సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న లోక్ సభలో ఈరోజైనా చర్చ జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి.
Next Story

