Wed Apr 01 2026 15:56:39 GMT+0530 (India Standard Time)
ఈరోజు ఈరూట్లో ప్రయణిస్తే మీ...పని అంతే...!

సంక్రాంత్రికి ఈరోజు సొంతూళ్లకు బయలుదేరారు ప్రజలు. దీంతో జాతీయ రహదారి రద్దీగా ఉంది. పంతంగిటోల్ ప్లాజా వద్ద దాదాపు రెండు కిలోమీటర్లు బారులు తీరాయి. ప్రధానంగా హైదరాబాద్ -విజయవాడ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈరోజు నుంచి రేపు సాయంత్రం వరకూ హైదరాబాద్ -విజయవాడ రహదారిపై ఎక్కువ రద్దీ ఉండే అవకాశముంది. దీంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించారు. రైళ్లల్లో రిజర్వేషన్లు లేవు. ఇక ఆర్టీసీ బస్సుల్లో కూడా సీట్లు లేవు. దీంతో ప్రయాణికులు ప్రయివేటు బస్సులను ఆశ్రయించినా అధికరేటు ఉండటంతో ఎక్కువమంది సొంత వాహనాలపై తమ ఊళ్లకు బయలుదేరారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కార్లతో నిండిపోయింది. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అతి వేగం వద్దని టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.
- Tags
- టోల్ ప్లాజా
Next Story

