Sun Apr 05 2026 01:20:44 GMT+0530 (India Standard Time)
ఈ తేడాగాడికి ఆ పరీక్షలు చేయాల్సిందే...!

శోభనం రోజునే భార్యను చిత్ర హింసలకు గురిచేసిన చిత్తూరు జిల్లా రాజేష్ కు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలని చిత్తూరు కోర్టు పోలీసులు ఆదేశించింది. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో రాజేష్ కు ఈ పరీక్షలు నిర్వహించాలని కోర్టు పేర్కొంది. చిత్తూరు జల్లా గంగాధర నెల్లూరు మండలం చిన దామరగుంటకు చెందిన శైలజను అదే ప్రాంతంలో టీచర్ గా పనిచేస్తున్న రాజేష్ వివాహం చేసుకున్నాడు. తొలిరాత్రి ఆమెకు నరకం చూపించాడు. బ్లేడ్ తో కోసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో బెంబెలెత్తి పోయిన శైలజ కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేశారు. అయితే రాజేష్ కు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం రాజేష్ అభ్యంతరాలను పరిశీలించిన మీదట పరీక్షలు చేయాలని ఆదేశించింది.
- Tags
- శాడిస్ట్
Next Story

