Thu Apr 09 2026 22:53:13 GMT+0530 (India Standard Time)
ఈ టీఆర్ఎస్ నేత చేష్టలు చూశారా?

కట్టుకున్న భార్య ఉండగానే మరో పెళ్ళి చేసుకోవడమే కాకుండా నిలదీసిన భార్యను ఒక టీఆర్ఎస్ యువజన నాయకుడు దారుణంగా కొట్టి ఇంటి నుండి గెంటివేసిన సంఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో జరిగింది ... బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నాడు ... అయితే చందానగర్ కు చెందిన సంగీత ను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకోగా , వారికి రెండేళ్ల పాప కూడ ఉంది ... భార్య ఉండగానే మరొక యువతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడంతో పాటు , ఆడపిల్ల పుట్టిందని ఆరోపించడంతో పాటు సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేసాడు ... తీవ్రగాయాల పాలైన సంగీత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ... కాగా వివాదానికి కారణమైన శ్రీనివాస్ రెడ్డి ఇంటి నుండి పరారయ్యాడు.
- Tags
- టీఆర్ఎస్
Next Story

