ఈ గ్యాంగ్ ని టచ్...చేస్తే క్యాష్ గోవిందా...!

ఫొన్ కొట్టు మనీ పట్టు.. ఇప్పడు సైబర్ నేరగాళ్ల తీరు ఇది. అయితే ఈ సైబర్ నేరగాళ్లకు సిటీ పోలీసులు చుక్కలు చూపెడుతున్నారు. నార్త్ ఇండియా కేంద్రంగా నడుస్తున్న సైబర్ మోసాలకు సిటీ పోలీసులు చెక్ పెడుతున్న వైనమిది. ఏడాదిలో నే వందలాది మంది సైబర్ నెరగాళ్లును అరెస్టు చేసిన తీరు ఇది. ఫోన్ కొట్టి మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లు ఇప్పడు నిత్య కృత్యం. ఒన్ టైమ్ పాస్ వర్డ్ పేరుతో నానాటికి మోసాలు పెరిగి పొతున్నాయి. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మన డబ్బులను కొట్టే ముఠా ఇప్పడు కొకొల్లలు. మ్యారెజీ బ్యూరోల పేరుతో నిత్యం మోసాలు చేస్తునే వుంటారు. . లాటరీలో డబ్బులు వచ్చాయంటూ చేసే ఛీటింగ్ లు కూడా ఎక్కువగానే వుంటాయి. ..హైదరబాద్ లోని మన సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతుంటాయి. ముఖ్యంగా ఒన్ టైమ్ పాస్ వర్డ్ కేసులు ఎక్కువగా వుంటాయి. అయితే ఈ మోసాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయని ఆలొచన చేసిన పోలీసులు చివరకు తీగ నార్త్ ఇండియాలో అని తెలింది. దీంతో సీటి సైబర్ క్రైమ్ పోలీసులు నార్త్ ఛీటింగ్ ముఠాలను పట్టుకొవడానికి ఏకంగా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మన దగ్గర రోజురోజుకు పెరిగిపొతున్న ఛీటింగ్ కేసులను ఛేజ్ చేసేందుకు పోలీసులు ఈ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. గత ఏడాది కాలంలో నార్త్ ఇండియాకు చెందిన మొత్తం 333 మంది ఛీటర్స్ ను అరెస్టు చేసి కటాకటాల వెనక్కి నెట్టారు.ఇందులో నలుగురి పైన పీడి యాక్ట్ నమోదు చేశారు. ఈ మోసాలు ఎలా చేస్తున్నారన్న దానిపైన పోలీసుల విచారణ చేస్తున్న తీరు ఇలా వుంది.
ఓటీపీ తెలుసుకుని.....
ముఖ్యంగా ఒన్ టైమ్ పాస్ వర్డ్ పేరుతో కస్టమర్లకు బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నట్లుగా చెప్పి కాల్ చేస్తున్నారు. ఇలా కాల్ చేసిన వారి దగ్గర నుంచి బ్యాంకు కు సంబంధించి ఓటీపీ ని తీసుకుని మన బ్యాంకులో వుండే డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. ఇలా కొట్ల రూపాయలను ఈ గ్యాంగ్ అమాయక ప్రజల నుంచి కొల్లగొడుతున్నారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ కేసులను నమోదు చేసిన పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు.
నార్త్ ఇండియా నుంచే ఆపరేషన్.....
ఢిల్లీ, నోయిడా, గురగావ్ లలో మకాం వేసే ఈ గ్యాంగ్ ల లో ఎక్కువగా నైజీరియన్లు వుంటున్నారు. దీనికి తోడుగా స్థానికంగా వుండే కొంత మందితో కలిసి ఈ నైజిరియన్లు గ్యాంగ్ లుగా ఏర్పడుతున్నారు. వీరు డబ్బుల కోసం కక్కుర్తి పడి మోసాలు చేస్తున్నారు.. దీంతో పాటుగా చత్తీస్ గడ్ కు చెందిన జముతార్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ అత్యంత్య ప్రమాదకరం.. ఈ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ఇప్పటి వరకు ఎవరు సాహసం చేయలేదు. ఎందుకంటే ఈ ఏరియాకు వెళితే తిరిగి వచ్చిన వారు ఎవరూ లేరు అలాంటి ప్రాంతానికి వెళ్లి కూడా సిటి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మరొక వైపు గత ఏడాది కాలంలో మొత్తంలో 333 మంది సైబర్ నేరగాళ్లను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఎక్కువగా ఢిల్లీ లోనే మకాం వేసిన వారిని అరెస్టు చేశారు. వీరి దగ్గరనుంచి మూడు కోట్ల కు పైగా నగదు ను కూడా సీజ్ చేశారు. అయితే బ్యాంకులతోపాటుగా ఇతర్రత ఫోన్ కాల్స్ లో వచ్చే ఆఫర్స్ గురించి ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మవద్దని పోలీసులు సలహా ఇస్తున్నారు. ఇదిలా వుంటే దేశవ్యాప్తంగా సైబర్ నెరగాళ్లను అరెస్టు చేయడంలో సిటి సైబర్ క్యాప్స్ చరిత్ర సృష్టించారు. పిడి యాక్ట్ వేయడంతో పాటుగా కొందరిపైన హిస్టరీ షీట్స్ ను పోలీసులు తెరిచారు.
- Tags
- సైబర్ గ్యాంగ్

