Sat Mar 28 2026 23:15:02 GMT+0530 (India Standard Time)
ఈ ఒక్క ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పాలన్న వైసీపీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి జనసేన మిత్రపక్షమో? కాదో? చెప్పాలని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మిత్రపక్షంగా ఉంటున్నారా? లేక అధికార పక్షం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తారో చెప్పాలని బొత్స పవన్ పార్టీని నిలదీశారు. బీజేపీ, టీడీపీలు కలిసే ఏపీ ప్రజలను మోసం చేశాయన్న బొత్స సత్యనారాయణ, కేంద్రంపై వత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ కు వైసీపీని ఎవరూ ఆహ్వానించలేదని బొత్స మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెడితే తాము మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బొత్స ప్రకటించారు.
- Tags
- పవన్ వైసీపీ
Next Story

