ఈ ఎమ్మెల్యే రేవంత్ ను ఎందుకు కలిశారు?

రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో వార్తల్లో వ్యక్తి. ఆయన పేరు ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ మారుమోగి పోతుంది. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ రేవంత్ తో గంటన్నర పాటు భేటి కావడం ఆసక్తి కరంగా మారింది. పెద్దమ్మ గుడికి వచ్చి యాధృచ్ఛికంగానే రేవంత్ రెడ్డిని కలిశానని ప్రభాకర్ చెబుతున్నప్పటికీ ఆయన మాటలను బీజేపీ నేతలు కూడా నమ్మడం లేదు. బీజేపీలోకి ఆహ్వానించడానికే ప్రభాకర్ రేవంత్ ఇంటికి వెళ్లాడా? అన్న చర్చ జరుగుతోంది. సహజంగా ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ రూటే వేరు. ఆయన పార్టీ చెప్పినట్లు నడుచుకోరు. తన దారి తనదే. తాను అనుకున్నది చేస్తారు తప్ప పార్టీ లైన్ ప్రభాకర్ కు అవసరం లేదన్న సంగతి నేతలకూ తెలుసు.
చేరికలపై ఆరా కోసమేనా?
అయితే తాజాగా రేవంత్ రెడ్డిని ప్రభాకర్ కలవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీలో చేరికకు ఆహ్మానం కోసమే అయితే హైకమాండ్ ను సంప్రదించాలి. కాని ప్రభాకర్ వ్యక్తిగతంగానే రేవంత్ ను కలిసినట్లు సమాచారం. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రభాకర్ తన ప్రత్యర్థి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ అని భావిస్తుంటారు. వీరేందర్ గౌడ్ కార్యక్రమాలపై ప్రభాకర్ ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు. అయతే రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వీరేందర్ గౌడ్ కూడా వెళతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ వీరేందర్ గౌడ్ విషయాన్ని ఆరా తీసేందుకే రేవంత్ వద్దకు వెళ్లి ఉంటారని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప్పల్ నుంచి వీరేందర్ బరిలోకి దిగుతారా? లేదా? అన్న విషయాన్ని కన్ ఫర్మ్ చేసుకోవడానికే ప్రభాకర్ రేవంత్ ను కలిసినట్లు తెలుస్తోంది.
- Tags
- రేవంత్ రెడ్డి

