ఇవాంకా వచ్చేశారు...దాన్ని మూసేశారు...!

అర్ధరాత్రి సమయంలో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ కు చేరుకున్నారు.. అంతర్జాతీయ ఔత్సాహికుల సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొన్న బోతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ తెల్ల వారు జూమున ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ కు వచ్చారు. కమర్షియల్ ప్లైట్ లో నగరానికి వచ్చారు. తెల్లవారుజూమున మూడు గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్ పొర్టులో ల్యాండ్ అయ్యారు. ట్రంప్ కు అధికారులు స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పొర్టులో ల్యాండ్ అయిన ఇవాంకా నేరుగా మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఎయిర్ పొర్టులో ల్యాండ్ అయిన ఇవాంకా కు ప్రభుత్వం తరుపున జయేష్ రంజన్. శాంతి భద్రతల అదనపు డిజి అంజనీకూమార్.. అమెరికా కాన్సులేట్ అధికారులు స్వాగతం పలికారు. ఔటర్ రింగ్ రోడ్డులో ఇరవై ఐదు నిమిషాల పాటుగా ప్రయాణం చేసిన ఇవాంకా ట్రైడెంట్ హొటల్ లో బస చేశారు.. ఇవాళ మూడు గంటల వరకు ఇవాంక కు సంబంధించిన ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు.. మూడు గంటల ప్రాంతంలో హైటెక్స్ కు చెరుకుని అక్కడ అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొంటారు. ప్రదాని మోడీతో కలిసి ఈ సదస్సును ఆరంభిస్తారు. రాత్రికి ఫలక్ నూమాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిన్నర్ లో పాల్గొంటారు..ఇవాంకా భద్రత కోసం పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా సీక్రెట్ సర్వీసెస్ తోపాటు మన ఇంటెలిజెన్స్ అధికారులు సెక్యూరిటిని పర్యవేక్షిస్తున్నారు.
ఇవాంకా రాకతో అర్ధరాత్రి ఔటర్ మొత్తం జామ్....
తెల్ల వారుజూమున ఇవాంకా ట్రంప్ హైదరబాద్ కు వచ్చారు.. శంషాబాద్ ఎయిర్ పొర్టులో ల్యాండ్ అయిన ట్రంప్ నేరుగా మాదాపూర్ లోని హోటల్ కు వెళ్లిపోయారు.. ట్రంప్ రాకతో నగర వాసులకు తెల్ల వారు జూము నుంచే ట్రాఫిక్ ఇక్కట్లు మొదలయ్యాయి. ట్రంప్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మాదాపూర్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇవాంకా ప్రయాణం చేసే మార్గాన్ని పోలీసులు పూర్తిగా కట్టుదిట్టం చేశారు.ఎలాగంటే ఈ రోడ్డులో ఎవరిని కూడా అనుమతించ లేదు. సరిగదా.... రెండు గంటల ముందు నుంచే ఔటర్ ను మొత్తం కూడా అధికారులు మూసి వేశారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదకు ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతె బెంగళూరు హైవేతో పాటుగా గచ్చి బౌలి ప్రాంతంలో గంటల తరుబడి వాహనాలు నిలిచి పోయాయి. రవాణా వ్యవస్త మొత్తం కూడా నిలిచి పొయింది.
- Tags
- ఇవాంకా

